మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Bilvashtakam – బిల్వాష్టకం

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ |
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ || 1 ||

త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలైః శుభైః |
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ || 2 ||

అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే |
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్ || 3 ||

సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోఽర్పయేత్ |
సోమయజ్ఞమహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్ || 4 ||

దంతికోటిసహస్రాణి వాజపేయశతాని చ |
కోటికన్యామహాదానాం ఏకబిల్వం శివార్పణమ్ || 5 ||

పార్వత్యాః స్వేదసంజాతం మహాదేవస్య చ ప్రియమ్ |
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్ || 6 ||

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్ |
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ || 7 ||

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే |
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్ || 8 ||

బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
సర్వపాపవినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్ || 9 ||

ఇతి బిల్వాష్టకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.